Home తాజా వార్తలు పెళ్లి క్యాన్సిల్.. యువకుడి ఆత్మహత్య…

పెళ్లి క్యాన్సిల్.. యువకుడి ఆత్మహత్య…

Young Man Commits Suicide after Marriage Cancelled

హైదరాబాద్: ప్రేమించిన యువతితో పెళ్లి క్యాన్సిల్ అయిందనే మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన హైదర్‌నగర్ పరిధిలోని ఎల్లమ్మబండ దత్తాత్రేయనగర్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే వెంకట్రావు, దుర్గ దంపతుల కుమారుడు సాయికిరణ్(24) అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి ఖాయం చేసుకున్నాడు. అయితే సాయికిరణ్‌కు పాక్షికంగా పొలియో ఉండటంతో యువతి తల్లిదండ్రులు పెళ్లి రద్దు చేసుకున్నారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సాయి సోమవారం సాయంత్రం హైదర్‌నగర్ అలీతలాబ్ చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహం నీటిలో తేలడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకి తీయించారు. మృతుడిని సాయికిరణ్‌గా గుర్తించి అతడి కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.