Home ఆంధ్రప్రదేశ్ వార్తలు యువకుడి ఆత్మహత్య

యువకుడి ఆత్మహత్య

Young Man Commits Suicide at Hyderabadహైదరాబాద్ : పేట్ బషీరాబాద్ వాజపేయీ నగర్ లో శుక్రవారం విషాద సంఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా  తనకు చెప్పకుండా  భార్య పుట్టింటికి వెళ్లిందన్న మనస్తాపంతో చరణ్ తేజ్ రెడ్డి అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు చరణ్ తేజ్ రెడ్డి కడప జిల్లాకు చెందిన యువకుడని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. చరణ్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Young Man Commits Suicide at Hyderabad