Search
Thursday 19 July 2018
  • :
  • :
Latest News

ఉరి వేసుకుని యువకుని ఆత్మహత్య

Young man committed suicide by hanging the tree

ఆత్మకూరు: మండలంలోని ఖపురాయపల్లి గ్రామానికి చెందిన కొంగరి సుధీర్ (సామేల్ )(24) బుధవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకుని మరణించాడు. మృతుని తండ్రి నర్సింహ్మ చెప్పిన వివరాల ప్రకారం… సుధీర్ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడని పెండ్లి చేయాలని అనుకుంటున్నామని ఇంతలోనే ఇలా జరిగిందని విలపించాడు. స్థానిక ఎస్ఐ జి. యాదగిరి శవానికి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించాడు. మరణానికి గల కారణాలు తెలియలేదని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపాడు.

Comments

comments