కాగజ్నగర్: కాగజ్నగర్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతగూడ రైల్వే క్రాసింగ్ వద్ద బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు కాగజ్నగర్ జిఆర్పి స్టేషన్ ఇంచార్జి వెంకటమల్లు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్నగర్ మండలం కోయవాగుకు చెందిన అబ్దుల్ షౌకత్ (32) అనే యువకుడు కూలీ పని చేసేవాడని, అయితే గత కొంత కాలం నుండి త్రాగుడుకు బానిసై మంగళవారం సాయంత్రం ఇంటి నుండి వెళ్లి పోయి బుధవారం ఉయదం చింతగూడ రైల్వే క్రాసింగ్ సమీపంలో పట్టాలపై శవమై ఉన్నట్టు స్థానికులు అందించిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లి పంచనామ నిర్వహించినట్టు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఆయన తెలిపారు.