Home ఆంధ్రప్రదేశ్ వార్తలు చైనాలో తెలుగువాసి మృతి

చైనాలో తెలుగువాసి మృతి

Young Man dead in Road Accident at Chinaఅనంతపురం : బతుకుదెరువు కోసం చైనా వెళ్లిన ఎపి వాసి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన చైనాలోని షాంఘైలో జరిగింది. అనంతపురం జిల్లా కొత్తచెరువు మండలం  తిప్పబట్లపల్లికి చెందిన కోలాటి తిప్పన్న, వెంగమ్మ కొడుకు కిశోర్‌ ఉపాథి కోసం  చైనా వెళ్లాడు. అక్కడ షాంఘైలోని రెస్టారెంట్లో పనిచేస్తున్న కిశోర్‌ విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా అతని బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కిశోర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు. కిశోర్ మృతదేహాన్ని ఆయన స్వగ్రామానికి తరలించేందుకు చైనాలోని భారత రాయబారి కార్యాలయం అధికారులు ఏర్పాట్లు చేస్తన్నారు.

Young Man dead in Road Accident at China