Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ఫుట్‌బోర్డు ప్రయాణం.. యువకుడు మృతి…

Young man died after falling Bus foot board in Hyderabad

హైదరాబాద్: బస్సు ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలపాలైన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందిన విషాద సంఘటన యూసుఫ్‌గూడ శ్రీరామ్‌నగర్‌లో జరిగింది. స్థానికంగా నివాసముండే షేక్ ముక్తియార్ కుమారుడు షేక్ అజాహర్ ఈ నెల 3న బస్సులో వెళ్తుండగా పంజాగుట్ట షాలీమార్ జంక్షన్ వద్ద ఫుట్‌బోర్డు మీద నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో తోటి ప్రయాణికులు అజాహర్ ను చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మంగళవారం మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments