Home ఆదిలాబాద్ ఆటో బోల్తా… యువకుడి మృతి

ఆటో బోల్తా… యువకుడి మృతి

Young man died in Auto accident

 

ఆదిలాబాద్: మండలకేంద్రానికి రెండు కీలోమీటర్ల దూరంలో గల తెలంగాణ ధాబా వద్ద శనివారం ఆటో బోల్తాపడిన సంఘటనలోయువకుడు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాముగౌడ్ తెలిపిన కథనం ప్రకారం… ఇచ్చోడ మండలం పట్వారిగుడా గ్రామానికి చెందిన వెంటకటేశ్వర్ మడావి (20)అనే యువకుడు గుడిహత్నూర్ నుండి అదిలాబాద్ వైపు వెళ్తున్న ఆటోను డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో ఆటో అదుపు తప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న మడావి వెంకటేశ్వర్ అనే యువకుడు ఘటనా స్థలంలోనే మృతిచెందగా ఆటో డ్రైవర్ వాగ్మారే విట్టల్, మరో ప్రయాణికుడు కనక కృష్ణలకు స్వల్పంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వీరిని చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.

Young man died in Auto accident at Adilabad