Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ప్రమాదవశాత్తు చెరువులో మునిగి యువకుడి మృతి

                     Died-in-Lake

లోకేశ్వరం : మండలంలోని ధర్మోరా గ్రామానికి చెందిన సయ్యద్ అబ్దుల్ వాజిద్(40) అనే యువకుడు ప్రమాద వశాత్తు చెరువులో మునిగి మృతి చెందినట్లు లోకేశ్వరం ఎస్‌ఐ రమేష్ తెలిపారు. బాసరకు చెందిన అబ్దుల్ గత 6 సంవత్సరాల నుంచి ధర్మోరా గ్రామంలో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడని ఎస్‌ఐ అన్నారు. శుక్రవారం గ్రామ సమీపంలోని కుంటలోకి చేపలు పట్టేందుకు వెళ్లారని ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందినట్లు ఎస్‌ఐ వివరించారు. గజ ఈతగాడు హనుమంత్ జాలరు బృంధంతోవెతికించగా శనివారం కుంటలో మృతుడి శవం లభ్యమైందన్నారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు కుమార్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

Comments

comments