Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

young man died in road accident

కృష్ణా : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎనికేపాడు ఎన్‌టిఆర్ బొమ్మ వద్ద మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. విజయవాడ నుంచి గన్నవరం వైపు బైక్‌పై వెళుతున్న ఇద్దరిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయవాడలోని పడమటకు చెందిన సూర్యనారాయణ (25) మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం కోసం సూర్యనారాయణ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

young man died in road accident

Comments

comments