Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

road-accident

భద్రాద్రి కొత్తగూడెం: రోడ్డుప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం హనుమంతులపాడు సమీపంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న యువకులను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ రోడ్డుప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. మరో యువకుడు తీవ్ర గాయలపాలయ్యాడు. గాయపడిన యువకుడిని వెంటనే చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికి తరలించారు.