Home కామారెడ్డి వరికోత మిషన్ కిందపడి యువకుడి మృతి

వరికోత మిషన్ కిందపడి యువకుడి మృతి

paddy-machineబీర్కూర్: వరికోత మిషన్ కిందపడి యువకుడు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా వర్ని మండలం తగిలేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వీరయ్య అనే యువకుడు వరి కోత మిషన్ నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి ఓ రైతు పొలంలో వరి కోస్తుండగా కాలుజారి యంత్రం కిందపడి మృతి చెందాడు. వీరయ్య తండ్రి సాయిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరయ్య భార్య కావేరి ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భణి.