Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

విద్యుద్ఘాతంతో గొర్రెల కాపరి మృతి

Young Man Dies Current Shock In Nalgonda District

చిట్యాల : మండల పరిధిలోని వెల్మినేడు గ్రామ పరిధిలో గొర్రెలను మేపడానికి వెళ్లిన యువకుడు ప్రమాదవాశాత్తు విద్యుత్ షాక్ కొట్టడంతో అక్కడి కక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బైకాని నరేష్ 22 అనే యువకుడు గొర్రెల కాపరి తన గొర్రెలను తొలుకుని మేత మేపటానికి వెళ్లాడు. గొర్రెలు అటు వైపుగా వెళ్తుండగా అతను వాటి వెనకాల వెళ్లి అక్కడే వున్న విద్యుత్ స్దంబానికి వద్దకు వెళ్లగానే అంతకు ముందే విద్యుత్ స్దంబం పైన వున్న పరికరం విరిగిపోయి స్దంభానికి విద్యుత్ సరఫరా అవుతున్నందున అతనికి విద్యుత్ షాక్ కొట్టింది. దాంతో అతను స్దంభం దగ్గర పడిపోయాడు. దాంతో తల వెనకభాగం కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనను పోలీసులకు తెలియచేయటంతో సిఐ నరేందర్ సంఘటన స్ధలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సబ్‌స్టేషన్ కార్యాలయం ఎదుట గ్రామస్తుల ధర్నా
విద్యుత్ షాక్‌కు గురై గొర్రెల కాపరి మృతి చెందటంతో సంఘటన జరుగటానికి విద్యుత్ అధికారుల నిర్లక్షమే కారణమంటూ మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు, పలు పార్టీల నాయకులు .మృతుడి బంధువులు స్దానిక సబ్‌స్టేషన్ ఎదుట మృత దేహంతో పాటు ధర్నాకు దిగారు. ఈ సందర్బంగా గొర్రెల పెంపకం దార్ల జిల్లా అధ్యక్షులు అవిశెట్టి శంకరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ కు సంబందించిన పనులను కాంట్రాక్టర్‌లకు అప్పజెప్పి చేతులు దులుపుకోవటంతో కాంట్రాక్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించి నాసి రకమైన సామాగ్రిని ఉపయోగిస్తుండటం మూలంగానే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్సులేటర్‌లు తరచుగా ఫేల్ అవటం ,ట్రాన్స్‌ఫార్మర్‌లు కాలిపోవటం వల్లే రైతులు గొర్రెల మేకల పెంపకందారులు మూగ జీవాలు విద్యుత్ ప్రమాదాలకు గురౌతున్నారని అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి కాంట్రాక్టర్‌లు చేస్తున్న అవినీతిని అరికట్టాలని అన్నారు. ప్రభుత్వం అన్ని స్దాయిల్లో మృతుడి కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఏ చిరుమర్తి లింగయ్య,మేడి నరేష్, బైకాని నాగరాజు, దేశగోని లింగస్వామి, చీమల శ్రీను, మృతుడి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
2

Comments

comments