Home నల్లగొండ బైక్,ట్రాక్టర్ ఢీ.. ఒకరు మృతి

బైక్,ట్రాక్టర్ ఢీ.. ఒకరు మృతి

Young man dies in deadly motorcycle crash

మేళ్లచెర్వు : కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడన్న కన్న కుమారుడు తండ్రి ఎదుటే అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో మృతి చెందిన సంఘటన మేళ్లచెర్వు మండల కేంద్రంలోని ఎర్రగడ్డ తండ సమీపంలో ఇందిరమ్మ కాలనీ వద్ద చోటు చేసుకుంది. మంగళవారం కొండపల్లి అంజయ్య అనే కుటుంబం గత పది సంవత్సరాలుగా బతుకుదెరువు కోసం మేళ్లచెర్వు మండలంలోని ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారి కుమారుడు గంగయ్య(18) బైక్‌పై ఇంటి నుండి బయటకు వస్తుండగా అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొని గంగయ్య మృతి చెందాడు. ఢీకొన్న ట్రాక్టర్ సాగర్ ఎడమకాల్వలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనపై పోలీసులు ధర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.