Home రంగారెడ్డి రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Young Man Dies In Road Accident In Ranga Reddy Dist

కొత్తూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. కొత్తూరు ఎస్‌ఐ శ్రీ శైలంయాదవ్ కథనం ప్రకారం…శుక్రవారం రాత్రి పెంజర్ల బైపాస్ రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రమేశ్(23) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన రమేష్ ను 108 వాహనంలో షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడు ఇన్ముల్‌నర్వ గ్రామానికి చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.