Home మహబూబాబాద్ విద్యుధ్ఘాతంతో యువకుడు మృతి

విద్యుధ్ఘాతంతో యువకుడు మృతి

Young Man Dies With Current Shock In Mahabubabad Dist

మరిపెడ ః విద్యుత్ ఘాతంతో యువకుడు, ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన మరిపెడ మండలంలోని ఎల్లంపేట గ్రామ శివారు సోమ్లాతండాలో శనివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం తండాకు చెందిన ఆజ్మీరా సుధాకర్(25) వ్యవసాయ బావి వద్ద 15 రోజుల కిందట బావికి వచ్చే విద్యుత్ తీగలు తెగిపోవడంతో స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవకపోవడంతో ప్రైవేట్ వ్యక్తులు అయిన సురేష్, కుచలతో కలిసి సుధాకర్ తీగలను సరి చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా తీగలను లాగడంతో పైకి ఉన్న 11కెవి లైన్ తగలడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ సరాఫరా కావడంతో తీగను పట్టుకున్న సుధాకర్ అక్రడికక్కడే మృతి చెందాడు. ఇద్దరు సురేష్, కుచలకు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. సంఘటన తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యె డిఎస్ రెడ్యానాయక్, డోర్నకల్ నియోజకవర్గం యువ నాయకులు డిఎస్ రవిచంద్ర నాయక్‌లు మృత దేహానికి పూల మాలలు వేసి నివాళ్ళు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.