Home సిద్దిపేట యువకునిపై ఎలుగు బంటి దాడి

యువకునిపై ఎలుగు బంటి దాడి

Young Man Injured After Attack Bear In Siddipet

మద్దూర్ : ఎలుగుబంటి దాడిలో  యువకునికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం మండల పరిధిలోని లద్నూర్‌లో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు ఉదయం 6.30 గంటల ప్రాంతంలో గ్రామ నడిబోడ్డున గల రామాలయంలోకి ఎలుగుబంటి ప్రవేశించింది. ఎలుగుబంటిని చూసిన కొందరు దేవాలయం గేటు పెట్టడంతో గోడపై నుంచి బయటకు వచ్చింది. అనంతరం జనాలలోకి ప్రవేశించి పాలకేంద్రం నుంచి పాలు తీసుకొని వస్తున్న కాసర్ల యాదగిరి అనే యువకునిపై దాడి చేయగా అతనికి గాయాలు కాగా వెంటనే అక్కడి వారు కేకలు వేస్తూ బెదిరించడంతో ఊరు బయట గల ఎల్లమ్మ చెరువు వద్దకు వెళ్లింది. అక్కడి నుంచి గ్రామస్థులు కేకలు వేస్తూ రిజర్వాయర్ వరకు తరిమారు. అనంతరం పారెస్టు అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు.