Search
Sunday 18 November 2018
  • :
  • :

బంజారాహిల్స్ లో యువతి కిడ్నాప్‌…

Feemale-kidnap
హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో ఓ అమ్మాయిని ఓయువకుడు కిడ్నాప్‌ చేసి దాడికి పాల్పడ్డాడు. ఈ కిడ్నాప్ కి నిందితుడి ప్రియురాలు కూడా సహకరించింది. మొత్తానికి వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిరోజ్‌, కీర్తిలు తనను కిడ్నాప్ చేశారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తాను ఓ పబ్‌లో ఉండగా తనను కిడ్నాప్‌ చేసి, నిర్బంధించారని ఆమె తెలిపింది. తనపై బ్లేడ్లతో దాడి చేసి, తన దగ్గర ఉన్న నగదు, నగలను దొచుకున్నారని చెప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments