Home తాజా వార్తలు యువకుడి దారుణ హత్య

యువకుడి దారుణ హత్య

Young man killed at Ramanthapur

 

కర్రలు, రాళ్లతో కొట్టి చంపిన నిందితులు
గతంలో వారితో మృతుడికి గొడవలు
కేసు పెట్టడంతో ఆగ్రహంతో హత్య

హైదరాబాద్: పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని ఏడుగురు కలిసి హత్య చేసిన సంఘటన నగరంలోని రామంతపూర్‌లో ఆదివారం తెల్లవారు జామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం…సూర్యపేట జిల్లా తిరుమలగిరి మండలం, వెలిశాల గ్రామానికి చెందిన మొగలి యాదగిరి బతుకు దెరువు కోసం మూడేళ్ల క్రితం నగరానికి వచ్చి ఉప్పల్ రామంతపూర్‌లోని కేసిఆర్ నగర్‌లో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. యాదగిరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు ప్రసాద్(22) ఆఫీస్ బాయ్‌గా పని చేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం ప్రసాద్‌కు ముస్తాక్ ఖాన్, నాగరాజుతో గొడవలు జరిగాయి. దీంతో వారు ఇద్దరు ప్రసాద్ ఇంటికి వచ్చి సామగ్రిని ధ్వంసం చేశారు. ప్రసాద్ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

దీనిని మనసులో పెట్టుకున్న నాగరాజు, ముస్తాక్ అప్పటి నుంచి మీ కుటుంబాన్ని మొత్తం చంపివేస్తామని హెచ్చరించారు. ఉదయం ఆఫీస్‌కు వెళ్లిన ప్రసాద్ సాయంత్రం ఇంటికి వస్తున్నానని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. కానీ అర్ధరాత్రి అయినా కూడా ప్రసాద్ ఇంటికి రాలేదు, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఆదివారం ఉదయం తెలిసిన వ్యక్తి వచ్చి ప్రసాద్‌ను హ్యాపీ బార్ వద్ద ఎవరో హత్య చేశారని తెలపడంతో వెంటనే అక్కడికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడిఉన్నాడు. ప్రసాద్‌ను కర్రలు, రాళ్లు, కత్తులతో పొడిచి చంపివేశారు. నిందితులు ముస్తాక్, నాగరాజు, రమేష్, సాయి, సంతోష్ అలియాస్ ప్రశాంత్, రాజు, సునీల్‌ను అరెస్టు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఉప్పల్ పోలీసులు తెలిపారు.

Young man killed at Ramanthapur in Uppal