Home తాజా వార్తలు జింకను చంపి… స్నేహితులకు దావత్

జింకను చంపి… స్నేహితులకు దావత్

Deer

 

హైదరాబాద్: తెలంగాణలోని వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం భానుపూర్ గ్రామంలో జింకను చంపిన ఘటన కలకలం సృష్టించింది. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…. శేఖర్ అనే వ్యక్తి జింకను చంపి తన స్నేహితులకు దావత్ ఇచ్చాడు. ఈ విషయం అటవీ శాఖ అధికారులకు తెలియడంతో పోలీసుల సహాయంతో శేఖర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.. జింకను చంపిన ప్రాంతంలో తల, కాళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద శేఖర్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. నెమళ్లు, జింకలు వంటి జీవులను వేటాడటంపై ప్రభుత్వాలు నిషేధించాయి. 

 

Young Man Killed Deer after Give Party in Vikarabad

 

Young Man Killed Deer in Vikarabad