Home పెద్దపల్లి మరో యువతిని పెళ్లాడిన ప్రియుడు

మరో యువతిని పెళ్లాడిన ప్రియుడు

మనస్తాపంతో యువతి ఆత్మహత్యాయత్నం

                 Love

పెద్దపల్లి రూరల్: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ప్రియుడు మోసం చేసి అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో ప్రియురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన మంగళవారం పెద్దపల్లి జిల్లా లోని గౌరెడ్డిపేట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గౌరెడ్డిపేట గ్రామాని కి చెందిన కోట అనూష అదే గ్రామానికి చెందిన ఉత్కం క్రాంతి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లోవారికి తెలి యడంతో కుల సంఘం నాయకులను ఆశ్రయించారు.

ఈ క్రమంలో పెద్దమను షులు క్రాంతి కుటుంబసభ్యులతో మాట్లాడి పెళ్లికి ఒప్పించారు. అమ్మాయి తల్లి పెళ్లి విషయమై మాట్లాడేందుకు క్రాంతి ఇంటికి వెళ్లగా వారు పెళ్లి నిరాకరించి ఇంటికి తాళం వేసి ఊరు విడిచి వెళ్లారు. దీంతో అనూష క్రాంతి ఇంటి ముందు దీక్షకు దిగింది. పోలీసులు వచ్చి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడం తో దీక్ష విరమించింది. తీరా క్రాంతికి పెళ్లి అయిందని తెలియడంతో తనకు అ న్యాయం జరిగిందని మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులు గమనించి చికిత్స నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆ సుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచనతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.