Home తాజా వార్తలు పాతబస్తీలో యువకుడి హత్య

పాతబస్తీలో యువకుడి హత్య

Young Man Murder in Hyderabad Old City

హైదరాబాద్ : పాతబస్తీలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన బాబా అనే యువకుడు తన స్నేహితుడు అబ్దుల్లాతో కలిసి స్థానికంగా ఉండే కొందరితో సోమవారం రాత్రి గొడవపడ్డాడు. బాబును దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. పాతకక్షలే ఈ హత్యకు దారి తీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం కోసం బాబా మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో పాతబస్తీలో ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Young Man Murder in Hyderabad Old City