Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

మిర్యాలగూడలో యువకుడి హత్య

Young man Murder

నల్లగొండ : మిర్యాలగూడలో శుక్రవారం ఉదయం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రణయ్ ఆరు మాసాల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వైద్య పరీక్షల నిమిత్తం తన భార్యను ఆస్పత్రికి తీసుకెళుతుండగా దుండగులు ప్రణయ్‌పై కత్తులతో దాడి చేశారు. దీంతో ప్రణయ్ అక్కడికక్కడే చనిపోయాడు. అత్తింటి వారే ప్రణయ్‌ను హత్య చేశారని ఆయన తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం కోసం ప్రణయ్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Young Man Murder in Miryalaguda

Comments

comments