Home తాజా వార్తలు పట్టపగలు నడి రోడ్డుపై వ్యక్తి దారుణ హత్య

పట్టపగలు నడి రోడ్డుపై వ్యక్తి దారుణ హత్య

Murdered

సంగారెడ్డి: పట్టపగలు యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన జిల్లాలోని పఠాన్ చెరు మండలం రుద్రారం లో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పట్టపగలు జాతీయ రహదారిపై  అందరూ చూస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిని దారుణంగా నరికి చంపారు. బైక్ పై వచ్చిన వ్యక్తులు యువకుడిని కత్తులతో దాడి చేసి పారిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరకున్న పోలీసులు మృతుడు మహబూబ్ గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం  గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

young man murdered on national highway at patancheru