Home నల్లగొండ సెల్ టవర్ ఎక్కి యువకుడి ఆత్మహత్యయత్నం

సెల్ టవర్ ఎక్కి యువకుడి ఆత్మహత్యయత్నం

Young Man Sucide Attempted In nalgonda District
కొండమల్లెపల్లి ః- ప్రేమించిన ప్రేయసి కోసం సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన శనివారం కొండమల్లెపల్లి చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన నూతనకంటి వెంకటయ్య- యాదమ్మ దంపతుల కుమారుడు సూతనకంటి సాయిరాజ్ డిగ్రీ చదవు పూర్తీ చేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికతో గత ఐదేళ్లుగా ప్రేమ వ్యవహరం నడుస్తు ప్రేమలో పడ్డాడు. ఇద్దరికి ఒకరం అంటే మరొకరికి ఇష్టమని తమకు పెళ్లి చేయించాలని ఇటీవల పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు సమాచారం అమ్మాయి మైనర్ కావడంతో పోలీసులు స్టేషన్‌లోనే కౌన్సిలింగ్ ఇచ్చి ఇరువురిని ఇంటికి పంపిచారు. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు బంధువులకు తెలువడంతో అప్పటి నుంచి అమ్మాయిని ఓ ప్రైవేట్ హస్టల్‌లో ఉంచి చదివిస్తున్నారు. దీంతో నెల రోజులుగా ఇద్దరి మద్య సంభాషణ కుదరకపోవడంతో అవేధనకు గురైన సాయిరాజ్ గత నేల 26వ తేదిన దేవరకొండ రోడ్డులో గల సెల్ టవర్ ఎక్కి దాదాపు మూడు గంటలపాటు హల్‌చల్ చేసి స్థానికంగా ఉత్కంటం రేపాడు. తల్లిదండ్రులు, పోలీసులు, స్నేహితులు, ఫోన్‌లో కిందికి దాగాలని ఎంత బ్రతిమిలాడిన తనకు తన ప్రేయసితో మాట్లాడించాలని లేకుంటే టవర్ నుంచి కిందికి దూకుతానని అన్నాడు. దీంతో స్థానిక ప్రజలకు భయాందోళనతో ఉత్కంటంతో సెల్ టవర్ ఎక్కిన యువకుని పైపు చూస్తుండి పోయారు. స్థానికులు ఎంత బ్రతిమిలాడిన ఫలితం లేకుండా పోయింది. చివరకు తహాసిల్ధార్ ఘటన స్థలానికి వచ్చి సమస్యను శాంతియుతంగా పరిష్కరించేలా చూస్తానని హమీ ఇవ్వడంతో కిందికి దిగాడు. దీంతో శనివారం తమ సమస్యను పరిష్కారించాలని స్థానిక తహాసిల్ధార్ కార్యలయంలో తహసిల్ధార్‌కు కలువగా తమకు అనుకులంగా సమాదనం రాలేదని మనస్థాపం చెంది తిరిగి ఈ రోజు మధ్యాహాన అదే సెల్ టవర్ ఎక్కి తను ప్రేమించిన అమ్మాయిని చూపించి, మాట్లాడించాలని కోరారు. దీంతో స్థానిక ఎస్‌ఐ శంకర్‌రెడ్డి అతనితో మాట్లాడి సమస్యను పరిష్కారాని కృషి చేస్తానని చెప్పడంతో కింది దిగి వచ్చాడు. అతనిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి సాయిని, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.ఇరువు కుటుంబాలతో చర్చించి సమస్యను పరిష్కారం చేస్తామని ఎస్‌ఐ శంకర్‌రెడ్డి తెలిపారు.