Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

 Young Man Sucide Attempted In Yadadri District

చౌటుప్పల్ రూరల్: పురుగుల మందు సేవించి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఒకటి చౌటుప్పల్ మండలం డి నాగారం గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన వట్టిపల్లి మహేష్ (28) వృత్తి రీత్యా లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఉదయాన్నే గ్రామ శివారులోని వ్యవసాయ భూముల వద్దకు వెళ్లి పురుగుల మందు సేవించాడు. సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డాడు. అటుగా వెళ్లిన స్థానికులు అందించిన సమాచారం మేరకు మృతుని కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని చూడగా అప్పటికే మహేష్ మృతి చెంది ఉన్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటన్నది తెలియ రాలేదు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహానికి చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం జరిపించారు.

Comments

comments