Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

వారసత్వ ఉద్యోగం రాదని యువకుడి ఆత్మహత్య

Suicide

భూపాలపల్లి కోల్‌బెల్ట్ : జయశంకర్ జిల్లా భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని ఎల్బీనగర్‌లో నివసిస్తున్న ఓ నిరుద్యోగి వారసత్వం ఉద్యోగం రాదని తెలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల సమాచారం ప్రకారం.. సింగరేణిలో కెటికె -5వ గనిలో జనరల్ మజ్దూర్‌గా పనిచేస్తున్న దుర్గం రాజయ్య, కాంతల నాలుగవ సంతానం అయిన దుర్గం పృద్వీరాజ్ (25)ఆదివారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  బి.టెక్ చదివిన పృద్వీ తండ్రి వారసత్వ ఉద్యోగం వస్తుందని ఆశపడి దరఖాస్తు చేసుకున్నాడు. కానీ హైకోర్టు, సుప్రీంకోర్టులు వారసత్వ ఉద్యోగ నియామకాలను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయడంతో వారం రోజులుగా మదనపడ్డడాని తెలిపారు. తన అన్న, ఇద్దరు బావలు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో, తనకు ఇక ఉద్యోగం రాదేమోనని మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నారు.

Comments

comments