Home జనగామ రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

TRAIN-SUICIDE

జనగామ క్రైం: రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని వీవర్స్‌కాలనీ సమీపంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ సమ్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా హసన్‌పర్తి మండలానికి చెందిన మదనగాని శ్రీకాంత్(24) లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. జనగామ మండలం పెంబర్తిలో ఉండే తన పిన తల్లిని చూడడానికి వచ్చాడు. ఇంటికి వచ్చిన సమయంలో తన పిన తల్లి ఇంట్లో లేకపోవడంతో తిరుగుముఖం పట్టాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం వీవర్స్‌కాలనీ వద్ద డౌన్‌లైన్లో గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేస్తున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ సమ్మిరెడ్డి తెలిపారు.