Home తాజా వార్తలు ప్రేమ విఫలం… యువకుడు ఆత్మహత్య

ప్రేమ విఫలం… యువకుడు ఆత్మహత్య

Young Man Suicide

 

యాదాద్రి భువనగిరి: జిల్లాలోని బొమ్మాయిపల్లి సమీపంలో ఆదివారం రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపలికి చెందిన వినోద్ భువనగిరిలో ఓ షాప్‌లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తన షాప్ కు వచ్చే ఓ యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఆ యువతి తనను మోసం చేసిందని తను ఆత్మహత్య చేసుకుంటున్నాని వాట్సప్ లో తన మిత్రులకు మెసేజ్ చేసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడాడు. సమాచారం అందుకొని రైల్వే పోలీసులు ఘటన స్థలికి చేరుకొన మృతదేహాన్ని స్థాధీనం చేసుకొని స్థానిక పోలీసులకు మృతదేహాన్ని అప్పగించారు. మృతదేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.  ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలియజేశారు.

Young man suicide with Love failure in bhuvanagiri