Search
Saturday 17 November 2018
  • :
  • :

ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు దారి

                      Love-Cut-Blade

మెదక్ మున్సిపాలిటి: పట్టణంలోని దాయరవీధికి చెందిన అంకం వినయ్(19) ప్రేమ విఫ మైందని మనస్థాపానికి గురై బావిలో పడి ఆత్మహత్య చేసు కున్న సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. దాయర వీధికి చెందిన అంకం సత్యనారాయణ రాజేశ్వరిల మూడవ కుమారుడైన అంకం వినయ్(19) గత కొంత కాలంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు తన తోటి స్నేహితులతో సంభాషించినట్లు విశ్వసనీయ సమా చారం.

మంగళవారం రాత్రి తన స్నేహితులైన ఇద్దరితో మద్యం సేవించి తన ప్రేమ విషయం వారితో చెప్పుకుని బాధపడుతూ మధ్యలోంచి వెళ్లిపోయి అదే విధిలో గల ఒక కుంటలో పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రంతా బంధువులు, స్నేహితులు అతని కోసం వెతికినప్పటికి లాభం లేకపోయింది. బుధవారము నాడు ఉదయం కుంట లో శవమై తేలిన వినయ్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించి,  దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

comments