Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

పోలీసులు వేధిస్తున్నారని యువకుడి ఆత్మహత్య

young man suicided Police are harass

మన తెలంగాణ / తిమ్మాపూర్: మండలంలోని జూగుండ్ల గ్రామంలో పోలీసులు వేధిస్తున్నారంటూ ఉప్పుల సంపత్ 25 సంవత్సరాలు అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జూగుండ్ల గ్రామంలో బెల్ట్ బెల్ట్ షాప్ వద్ద జరిగిన గొవడలో సంపత్ ను 5 రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకొని చితకబాదటంతో శరీరం పై తీవ్ర గాయాలయ్యాయి. తిమ్మాపూర్ మండలంలో జరిగిన దొంగతనాలు తానే చేసానంటూ ఒప్పుకొవాలంటూ పోలీసులు టార్చర్ చేసినట్లు బాదితుడి కుటుంబికులు ఆరోపిస్తున్నారు. తన కొడుకును విడిచి పెట్టడానికి రెండు దఫాలుగా 25 వేల రూపాయల లంచాన్ని పోలీసులకు ముట్టచెప్పినట్లు బాదితుడి తండ్రి వెంకటేష్ ఆరోపిస్తున్నాడు. మరోసారి సంపత్ ను సంపత్ ను పోలిస్ స్టేషన్ కు రావాల్సిందిగా హెడ్ కానిస్టేబుల్ మధుసుదన్ ఫోన్ చేయడంతో భయంతో సంపత్ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. దీంతో హుటాహుటిన భాదితుడిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స నందిస్తున్నారు. పోలీసులు చేయని తప్పుకు శిక్షించడం కారణంగానే సంపత్ ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు బాదితుడి తండ్రి ,భార్య , బందువులు ఆరోపిస్తున్నారు. బాదితుడు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు.
బాధితుడి తండ్రి: తన కొడుకును పోలీసులు అకారంగా పోలిసుస్టేషన్ కు తీసుకెళ్లి విపరీతంగా కొట్టారు. గ్రామ సర్పంచు భర్త ఎల్లేష్ తన కొడుకు ను పోలిసులచే అకారణంగా కొట్టించాడు. మొదటగా బెల్ట్ షాపు యజమాని ఫిర్యాదు ఇవ్వకుండానే సర్పంచు భర్త ఫోన్ చేసి ఎస్‌ఐ నరేష్ రెడ్డి కి ఫోన్ చేసి చెప్పడంతో తన కొడుకుతో పాటు మరొకరిని స్టేషన్ కు తీసుకెళ్ల్లి విపరీతంగా కొట్టాడన్నారు. లేని దొంగతనాలను చేసానంటూ ఒప్పుకొవాని ఒత్తడి తెచ్చాడని తండ్రి వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దెబ్బలు మరిచిపోకముందే మళ్లి పోలీసుల నుండి ఫోన్ రావడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడినిట్లు తండ్రి వెంకటేష్ తెలిపారు.

Comments

comments