Search
Wednesday 14 November 2018
  • :
  • :

రైలు కింద పడి యువకుడు దుర్మరణం…

young-man-image

మన తెలంగాణ/ఆత్మకూర్ రూరల్‌:  ప్రేమించిన అమ్మాయి ఇక లేదని వార్త విన్న యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని శ్రీరాంనగర్ రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది. కొత్తకోట మండలం అప్పరాల గ్రామానికి చెందిన కొండన్న మూడవ కుమారుడు విక్రమ్ (22) ఉదయం 6 గంటలకు రైల్వేస్టేషన్ సమీపంలో సిగ్నల్ దగ్గర ఉండి కర్నూల్ నుండి హైద్రాబాద్ వెళ్తున్న కర్ణాటక క్రాంతి ఎక్స్‌ప్రెస్ అతి వేగంగా వెళ్తున్న క్రమంలో అప్పటికే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్దమైన విక్రమ్ రైలు పట్టాలపై తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తకోట మండల కేంద్రంలో డిగ్రీ చదువుతున్నాడు.  ప్రేమించిన అమ్మాయి మృతి చెందడంతోనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. వీరి ప్రేమ కులాంతర వివాహం కావడంతో పెద్దలు అంగీకరించలేదు. ప్రేమించిన ప్రియురాలు ఒక రోజు ముందు  ఆత్మహత్య చేసుకోగా అది తట్టుకోలేని విక్రమ్ శనివారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పంచనామా చేసి రైల్వే పోలీసులు విక్రమ్ కుటుంబానికి మృత దేహాన్ని అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నట్లు సిఐ శంకర్ తెలిపారు. యువకుని ఆత్మహత్య వల్ల ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Comments

comments