Home తాజా వార్తలు ప్రియురాలి కోసం ఆత్మహత్యాయత్నం

ప్రియురాలి కోసం ఆత్మహత్యాయత్నం

Attemt-to-suside

కర్ణాటక : ప్రేమించిన యువతి ప్రేమికుల రోజున కనిపించలేదన్న మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఇక వివరాలు చూస్తే… తమ ప్రేమ పెళ్లికి యువతి ఇంట్లో అంగీకరించలేదన్న బాధతో యువకుడు కత్తితో ఎదపై పొడుచుకున్నాడు. ఈ సంఘటన బుధవారం బళ్లారి జిల్లా హొసపేటెలో జరిగింది. హగరిబొమ్మన హళ్లికి చెందిన దేహదారుఢ్య క్రీడాకారుడు వీరేశ్‌(26), హొసపేటెలోని ఓ యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లిచేసుకోవాలనుకున్నారు. వీళ్ల ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలిసిపోయింది.  కులాలు వేరు కావడంతో ఆమె కుటుంబ సభ్యులు వారి పెళ్లికి  అంగీకరించలేదు. ప్రేమికుల రోజు తన ప్రియురాలిని కలిసేందుకు బుధవారం హొసపేటెకు వచ్చిన యువకుడికి  నిరాశే మిగిలింది. యువతిని ఇంట్లోనే నిర్బంధించారన్న సమాచారం యువకుడు తెలుసుకున్నాడు. బాధ తట్టుకోలేక కత్తితో ఛాతీపై పొడుచుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడ్ని స్థానికులు దగ్గరలోని దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం దావణగెరె ఆస్పత్రికి పంపించారు. ఈ ఘటనపై పట్టణ పొలీస్‌ స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు డిఎస్పి శివారెడ్డి తెలిపారు. బాడీ బిల్డింగ్ పొటీల్లో వీరేశ్‌ ఒకసారి ‘మిస్టర్‌ కర్ణాటక’ పురస్కారం అందుకున్నాడు.