Home తాజా వార్తలు రైలు కిందపడి యువుకుడి ఆత్మహత్య

రైలు కిందపడి యువుకుడి ఆత్మహత్య

 Young Men Commits Suicide

మిర్యాలగూడ: భరత్ అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మిర్యాలగూడలోని బాపూజీనగర్ లో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణం తెలియాల్సి ఉంది.