Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

యువత చదువుతోపాటు క్రీడారంగంలో రాణించాలి..

Young people need to be in the sport of sports.
వనపర్తి: యువత చదువుతోపాటు క్రీడారంగంలో రాణించాలని, బిజెపి జన చైతన్య రథయాత్ర . బహిరంగ సభను దిగ్విజయం చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్త అమరేందర్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వనపర్తి పట్టణ కేంద్రంలోని 5,6 వార్డుల్లో ఆదివారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్త అమరేందర్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్త అమరేందర్‌రెడ్డి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి యువత అన్ని రంగాల్లో రాణించాలని పేరు ప్రతిష్టలు సంపాధించాలని, చదువుతోపాటు క్రీడారంగంలో రాణించేందుకు కృషి చేయాలని కోరారు. క్రీడలు ఆడడం వల్ల శారీరక ధృఢత్వం, మానసిక వికాసం కల్గుతుందన్నారు. ఈ నెల 26న వనపర్తి జిల్లా కేంద్రంలోని బిజెపి జన చైతన్య రథయాత్ర బహిరంగ సభ నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. బహిరంగ సభను దిగ్విజయం చేయాలని కోరారు. అనంతరం యువకులకు 2 క్రికెట్ కిట్లను అందజేశారు. బహిరంగ సభ పోస్టర్లను బిజెపి, బిజెవైం నాయకులతో కలిసి రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు కొత్త అమరేందర్‌రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డిలు జన చైతన్య రథయాత్ర బహిరంగ సభ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్య క్షులు అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సబ్బిరెడ్డి వెంకట్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్, బి.కృష్ణ, కుమారస్వామి, బిజెవైఎం జిల్లా అధ్యక్షులు మోహన్ యాదవ్, ప్రధాన కార్యదర్శి నారాయణ, పట్టణాధ్యక్షులు పరుశురాం, కన్వీనర్ శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాసులు, కిరణ్, జహంగీర్, శ్రీశైలం, బుచ్చిబాబు, వెంకటేష్‌నాయుడు,వెంకటేష్‌సాగర్, బుడ్డన్న, మురార్జి, నాయ కులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

comments