Home తాజా వార్తలు ‘జై లవకుశ’ సెన్సార్ పూర్తి

‘జై లవకుశ’ సెన్సార్ పూర్తి

Jr.-NTR

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్ టిఆర్, యువ దర్శకుడు కెఎస్ రవీంద్ర(బాబీ) కాంబినేషన్ లో వస్తున్న మూవీ ‘జై లవకుశ’. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా బుధవారం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్  బోర్డు సభ్యులు ఈ మూవీకి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ మూవీ నిడివి 2 గంటల 35 నిమిషాలు ఉన్నట్లు తెలుస్తోంది.  ఫ్యామిలీ, యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ‘జై లవకుశ’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రం ట్రైలర్ కూడా రికార్డు స్థాయి వ్యూస్ తో దూసుకుపోతుంది. ముఖ్యంగా జై పాత్ర సిమాకే హైలైట్ కానుందని మూవీ వర్గాల సమాచారం.

తారక్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఎన్ టిఆర్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్ కథనాయికలుగా నటిస్తున్నారు. ఎన్ టిఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కల్యాణ్ రామ్ భారీగా నిర్మించారు. రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ పాటలు ఇప్పటికే మార్కెట్లో విడుదలై అలరిస్తుండడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. మిల్కీ బ్యూటీ తమన్నా ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుండడం కూడా మూవీకి అదనపు ఆకర్షణ. ఇన్నీ ప్రత్యేకతల మధ్య ‘జై లవకుశ’ దసరా కానుకగా సెప్టెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Young Tiger NTR’s ‘Jai Lava Kusa’ completes Censor Formalities.