Home మహబూబాబాద్ ప్రేమించి… పెళ్లి చేసుకుంటనని నమ్మించి మోసం…

ప్రేమించి… పెళ్లి చేసుకుంటనని నమ్మించి మోసం…

Young woman commit suicide

 

మహబూబాబాద్‌: జిల్లాలో ఓ యువకుడు ప్రేమించి… పెళ్లి చేసుకుంటనని నమ్మించి మోసం చేశాడని యువతి యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దంతాలపల్లి మండలం గున్నెపల్లికి చెందిన హెచ్చు రాధ, యాకయ్యకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె స్వాతి కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి పోస్టు ఆఫీసులో ఉదోగ్యం చేస్తూ మానుకోటలో అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. నర్సింహులపేటకు చెందిన నరేష్ అనే యువకుడు గత నాలుగు నెలలుగా స్వాతిని ప్రేమిస్తున్నంటూ.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఇద్దరు ఒకటైయ్యారు. ఈ క్రమంలో యువతిని పెళ్లి చేసుకోవాలని స్వాతి, తల్లి రాధ కలిసి నరేష్ ను అడిగగా అందుకు నరేష్ కట్నంగా రూ. 4 లక్షలు ఇవ్వాలని అన్నాడు. అందుకు స్వాతి, తల్లి రాధ తమ దగ్గర అంత డబ్బు లేదని చెప్పినా వినలేదు. దీంతో తాను మోసపోయానని మనస్తాపనికి గురైను స్వాతి మంగళవారం సాయంత్రం ఇంట్లో బాత్‌రూం శుభ్రపరిచే యాసిడ్‌ను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అది గమనించిన తల్లి స్థానికులు సహయంతో యువతిని చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వరంగల్‌ ఎంజిఎంకు తరలించిన తెలిపారు.

Young woman commit suicide in Mahabubabad