Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

యువతి ఆత్మహత్య

SUICIDE1: ఓ యువకుడి వేధింపులు భరించలేక చందన అనే ఓ యువతి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. హయత్‌నగర్  ఎల్లారెడ్డికాలనీకి చెందిన చందన(23) డిగ్రీ చదివింది. ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తోంది. శనివారం ఉదయం తన తల్లిదండ్రులతో కలిసి ఆమె హయత్‌నగర్ ఠాణాకు వచ్చింది. మూడు ఫోన్ నంబర్ల నుంచి తనకూ, తన కుటుంబసభ్యులకు తరచూ అసభ్య సందేశాలు వస్తున్నాయని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆ నంబరు చౌటుప్పల్‌కు చెందిన మహేష్‌దని విచారణలో తేలింది. ఆ యువకుడిని ఠాణాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగానే మధ్యాహ్నం చందన సరూర్‌నగర్ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఆమె మృతదేహాన్ని చెరువు నుంచి వెలికి తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. తన సోదరి మృతికి మహేష్‌తో పాటు అతని స్నేహితులే కారణమని చందన సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొంతకాలంగా తనను ప్రేమించాలంటూ చందనను మహేష్ వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆమె సోదరుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Comments

comments