Home కరీంనగర్ పెళ్లి ఇష్టంలేక యువతి బలవన్మరణం

పెళ్లి ఇష్టంలేక యువతి బలవన్మరణం

Suicide

పెళ్లి ఇష్టంలేక యువతి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే… ఎర్దండికి చెందిన రాజేష్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు సుప్రియ(23) ఈ ఏడాదే డిగ్రీ పూర్తి చేసింది. దాంతో ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించారు.

నిజామాబాద్‌కు చెందిన ఓ యువకుడితో పెళ్లి ఖాయం చేశారు. ఆదివారం నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. అయితే పెళ్లి ఇష్టంలేని సుప్రియ శనివారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.