Home జాతీయ వార్తలు మద్యం మత్తులో పోలీసులపై యువతి చిందులు

మద్యం మత్తులో పోలీసులపై యువతి చిందులు

Mumbai-Policeముంబయి: తాగిన మైకంలో 21 ఏళ్ల ఓ యువతి పోలీసులపై చిందులు తొక్కింది. అంతటితో అగకుండా నడిరోడ్డుపై నానా హంగామా చేసింది. మొతాదుకు మించి మద్యం సేవించి ఏకంగా ఆరుగురు పోలీసులపై చేయిచేసుకుంది. ఈ ఘటన ముంబయి నగరంలో అర్ధరాత్రి 1.15 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే…. గౌరీ బిడే అనే యువతి పీకలదాక తాగి కారు వేగంగా నడిపి, పోద్దార్ ఆస్పత్రి సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా నోటికి వచ్చినట్లు తిట్టింది. ఈ క్రమంలో ఆరుగురు పోలీసులపై చేయిచేసుకుంది. అసభ్యపదజాలంతో దూషించింది. కాగా ఇదే కారులో యువతితోపాటు ఉన్న మరో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.