జనగామ : నూనెగూడెం సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బైక్ కల్వర్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతు యువతి మృతి చెందింది. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు రఘునాథపల్లి మండలం కంచినపల్లి గ్రామానికి చెందిన అమనగంటి రాజశేఖర్, గుండాల మండలం నూనెగూడెంకు చెందిన లొంక కరుణగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.