Home తాజా వార్తలు అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

Dead-Body

అమరావతి: డూ అండ్ డై బ్యూటీ పార్లర్‌లో గురువారం ఉదయం సిరి అనే యువతి మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన గదిలో ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయిందని నిర్వాహకులు తెలిపారు. మృతురాలు స్వస్థలం యాదాద్రి జిల్లా వెలిగొండ మండలం రెడ్లపాక గ్రామంగా గుర్తించారు. బెడ్‌పై యువతి విగతజీవిగా పడి ఉండడంతో మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. స్థానిక నేతలు కేసు మాఫీ చేసేందుకు రంగంలోకి దిగినట్టు సమాచారం.