Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

మల్టీ నేషనల్ యజమాని అరెస్ట్…

M.D--Arest-image

హైదరాబాద్ :  మల్టీ నేషనల్ సంస్థ ఎండి పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం 34లోని అగ్రి ఉత్పత్తుల తయారీ సంస్థ బిగ అగ్రికల్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండి థ్రోస్టన్ రీనర్ నామన్(52) జూబ్లీహిల్స్‌లో ఓ యువతి (31)తో ఇటీవల ఓ ప్రాజెక్టు పనిమీద పరిచయమైంది. కొన్ని రోజుల తర్వాత వాట్సప్ లో అమ్మాయికి  థ్రోస్టన్ అసభ్యకరమైన మెస్సెజ్ లు పంపాడు. ఎన్ని సార్లు హెచ్చరించిన అతడి బుద్ధి మారకపోవడంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు థ్రోస్టన్‌పై ఐపిసి 354ఎ, 354డి సెక్షన్ల కింద కేసు బుక్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కూకట్‌పల్లిలోని లోథా టవర్స్‌లో నివాసం ఉంటున్న థ్రోస్టన్ జర్మనీకి చెందిన వాడని పోలీసుల విచారణలో తేలింది. తనపై కేసు నమోదు కావడంతో నిందితుడు థ్రోస్టన్ కోర్టులో లొంగిపోయినట్టు సమాచారం.

Comments

comments