Home కుమ్రం భీం ఆసిఫాబాద్ మనస్థాపంతో యువతి ఆత్మహత్య

మనస్థాపంతో యువతి ఆత్మహత్య

                    Suicide-in-Adilabad

సిర్పూర్(యు) : మండలంలోని పంగిడి గ్రామ పంచాయతీలోని పవారిగూడ గ్రామానికి చెందిన మహోరే నిర్మల (18) అనే యువతి మంగళవారం రాత్రి మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మృతిరాలి తండ్రి అశోక్ కథనం ప్రకారం తన భార్య చెల్లి మీరాబాయి అల్లుడి సంతోష్‌తో మృతురాలు సన్నిహితముగా ఉంటుందని గత నెల రోజులుగా గ్రామంలో అందరికి చెప్పడమే కాకుండా మంగళవారం ఉదయం ఇంటికి వచ్చి నిర్మలను అసభ్యంగా దూషించడంతో మనస్థాపనికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో పత్తికి వేసే పురుగుల మందు తాగింది. గమనించి ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మృతి చెందినట్లు తెలిపారు. తన కుమార్తేను అవమానించి ఆత్మహత్యకు ప్రేరేపించినా జాతే మీరాబాయిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని మృతురాలి తండ్రి అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.