అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా పెండ్లిమర్రి మండలం మొయిళ్ల కాల్వ గ్రామంలో గురువారం ఉదయం ప్రేమ వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. సమరసింహా రెడ్డి అనే వ్యక్తి వరలక్ష్మిని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. వరలక్ష్మి భయంతో విషగుళికలు తిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.