Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

మోసం చేసిన యువకుడితోనే పెళ్లి.. !

యువతి పేర మూడు ఎకరాల భూమి
స్టాంప్ పేపర్‌పై రాసిచ్చిన యువకుడి తండ్రి రాజయ్య
ఠాణా ఎదుట బాధితుల ఆందోళనతో దిగివచ్చిన వైనం

                    love

గీసుకొండ: ప్రేమించి మోసం చేసిన యువకుడితోనే తండ్రిని కోల్పోయిన యువతి పెళ్లికి ఒప్పందం కుదిరింది. మండల కేంద్రానికి చెందిన కందికొండ గట్టయ్య అనే వ్యక్తి తన కూతురును ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారనే ఆవేదనతో, అవమానంగా భావించి క్రిమిసంహారక మందు తాగి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనగ్రామంలో ఉద్రిక్తతకు దారి తీసింది. ఇదే విషయమై మృతుడి బంధువులు, గ్రామస్తులు కొందరు శనివారం ఉదయం గీసుకొండ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. మోసం చేసిన దిడ్డి ప్రశాంత్ అనే యువకుడితోనే గట్టయ్య కూతురు మాధవి పెళ్లి జరిపించాలని డిమాండ్ చేశారు.

లేదంటే గట్టయ్య మృతదేహాన్ని యువకుడి ఇంటి వద్ద వేస్తామని గొడవ చేశారు. అయితే ఆందోళన చేయవద్దని బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని, గట్టయ్య ఆత్మహత్యతో ప్రమేయం ఉన్నవారిపై చర్యలు తీసుకుంటామని మామునూరు ఎసిపి శోభన్‌కుమార్ వారికి నచ్చజెప్పారు. దీంతో గట్టయ్య బంధువులు, మోసం చేసిన యువకుడి తండ్రి రాజయ్య పోలీస్‌స్టేషన్ వెలుపల మాట్లాడుకొని ఒప్ప ందం కుదుర్చుకున్నారు. గట్టయ్య కూతురును మోసం చేసిన కేసులో రిమాండ్‌పై జైలులో ఉన్న దిడ్డి ప్రశాంత్‌ను బెయిల్‌పై తీసుకొని వచ్చి జూలై 5వ తేదీన మాధవితో వివాహం జరిపిస్తామని, తనకు ఉన్న ఐదు ఎకరాల భూమిలో మూడు ఎకరాలను మాధవి పేర చేస్తానని స్టాంప్‌పేపర్‌పై రాజయ్య రాసి ఇచ్చారు.

దీంతో బాధితులు తమ ఆందోళనను విరమించారు. ఎసిపి శోభన్‌కుమార్‌తో పాటు పర్వతగిరి సిఐ సత్య నారాయణ, గీసుకొండ, సంగెం ఎస్సైలు రామకృష్ణ, నవీన్‌కుమార్, దీపక్, పోలీస్ సిబ్బంది బాధితులను శాంతింపచేసి గొడవలు జరగకుండా చర్యలు చేపట్టారు. యువకుడి తల్లిదండ్రులు, పంచాయతీ పెద్దపై కేసు కాగా ఆత్మహత్య చేసుకున్న గట్టయ్య భార్య కందికొండ లక్ష్మి శనివారం ఫిర్యాదు చేయగా ముగ్గురిపై గీసుకొండ ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేశారు. తన కూతురును పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన యువకుడు దిడ్డి ప్రశాంత్ తల్లిదండ్రులు రజిత-రాజయ్యలతో పాటు పెళ్లి జరిగేలా చూస్తానని మాట ఇచ్చి పట్టించుకోని వీరగోని రాజ్‌కుమార్ అనే పంచా యతీ పెద్ద కారణంగానే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని బాధితు రాలు ఫిర్యాదు చేయగా వారి ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఇది లా ఉండగా పంచాయతీ పెద్దగా ఉండి పెళ్లి జరిపించాలని చూస్తే కక్ష గట్టి తనపై కేసు పెట్టడం అన్యాయమని వీరగోని రాజ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

comments