Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

మాదాపూర్ లో యువతి అదృశ్యం

Young women missing in madhapur

మాదాపూర్: యువతి అదృశ్యమైన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహరాష్ట్ర నాగపూర్‌కు చెందిన వైష్ణవి (21) గత 15 రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చి తన స్నేహితురాలితో కలిసి మాదాపూర్‌లోని అయ్యప్ప సోసైటీలోని మహిళ హస్టల్‌లో ఉంటూ.. బంజారాహిల్స్‌లోని ప్రయివేటు కంపెనీలో ఉదోగ్యం చేస్తోంది. కాగా… తన స్నేహితురాలు వైష్ణవి ఆగస్టు 15న జుబ్లిహిల్స్‌లోని పెద్దమ్మ గుడికి వెళ్ళి వస్తాన్నాని వెళ్ళిన ఆమె తిరిగి రాలేదు. దీంతో రాకపోవడంతో చుట్టు ప్రక్కల వెతికిన, ఫోన్ స్వీచ్ ఆఫ్‌లో ఉందని, బంధువుల వద్ద అంతటా వెతికిన ఆచూకీ లభించక పోవడంతో గురువారం మాదాపూర్ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Comments

comments