Home తాజా వార్తలు కాపాడిన పాముని ముద్దాడి.. ప్రాణం కోల్పోయాడు!

కాపాడిన పాముని ముద్దాడి.. ప్రాణం కోల్పోయాడు!

Somnath-Mhatreముంబయి : పాములను కాపాడే ఓ యువకుడు చివరకు పాము కాటుతోనే ప్రాణాలు కోల్పోయాడు. నెవీ ముంబయికి చెందిన సోమనాథ్ మాత్రే అనే యువకుడు పాములను కాపాడుతాడు. ఈ నెల 2న తన స్నేహితుడు ఇచ్చిన సమాచారం మేరకు సిబిడి బెలాపూర్ ప్రాంతంలో ఓ కారులో ఉన్న పామును రక్షించేందుకు వెళ్లాడు. కారులో ఉన్న పామును కాపాడిన సోమనాథ్ దాన్ని మరో చోటుకు తీసుకువెళ్లాడు. అక్కడ ఫోటో కోసం దాని తలపై ముద్దాడాడు. ఆ సమయంలో పాము ఒక్కసారిగా సోమనాథ్ ఛాతీ భాగంపై కాటు వేసింది. ఇది గమనించిన స్నేహితులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజుల చికిత్స తర్వాత సోమనాథ్ ప్రాణాలు కోల్పోయినట్లు అతడి స్నేహితుడు తెలిపాడు. అతను గతంలో దాదాపు వంద పాములను కాపాడాడట. గత 12 ఏళ్లలో పాములను రక్షించే వ్యక్తుల్లో ఈ విధింగా మరణించిన 31వ వ్యక్తి సోమనాథ్.