Home స్కోర్ త్వరలో క్రికెట్‌కు యూనిస్ వీడ్కోలు!

త్వరలో క్రికెట్‌కు యూనిస్ వీడ్కోలు!

Younis-Khan

కరాచీ : పాకిస్థాన్ ఆటగాడిగా సుధీర్ఘ కాలం పాటు సేవలందించిన మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు త్వరలో వీడ్కోలు పలుకనున్నాడు. వెస్టిండీస్‌లో జరుగనున్న టెస్టు సిరీస్ అనంతరం తాను అంతర్జాతీయ క్రికెట్ గుడ్‌బై చెప్పనున్నట్టు శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఖాన్ ప్రకటించాడు. ‘ నేను రిటైర్ కావాలనుకుంటున్నాను. నేను రిటైర్ కావడానికి సరైన సమయమని అనుకుంటున్నా. ప్రతి క్రీడాకా రుడు తమ కెరీర్‌లో ఏదోఒక రోజు తీసుకోవాల్సిన నిర్ణయం. రిటైర్‌మెంట్ తీసుకోవడానికి సరైన సమయం కాదంటూ చాలామంది చెప్పారు. కానీ ఇదే సరైన సమయమని నా అభిప్రాయం. వెస్టిండీస్‌లో జరిగే టెస్టు సిరీస్ నా ఆఖరి మ్యాచ్. ఈ మ్యాచ్‌తో నా 17 ఏళ్ల టెస్టు కెరీర్‌ను ముగించాలన కుంటున్నా’ అని ఖాన్ వెల్లడించాడు.

పాకిస్థాన్ జట్టులో మూడు ఫార్మా ట్లలో మ్యాచ్‌లన్నీ ఖాన్ నేతృత్వంలో జరిగాయి. 2009 లో యూనిస్ ఖాన్ మార్గదర్శకాలతో పాక్ వరల్డ్ టి20 టైటిల్ కైవసం చేసుకుంది. టెస్టుల్లో ఇంకా 23 పరుగులు చేస్తే 10 వేల పరుగుల మైలు రాయిని యూనిస్ చేరతాడు. కాగా, యూనిస్ సహాచరడు మిస్బా ఉల్ హక్ కూడా ఏప్రిల్, మే నెలలో వెస్టిండీస్ పర్యటనలో సిరీస్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. యూనిస్ చాలా కాలం తరువాత 115 మ్యాచ్‌ల్లో 34 టెస్టు సెంచరీలు చేశాడు. ఈ సిరీస్‌లో మిగతా 23 పరుగులు చేస్తే యూనిస్.. పాక్ దేశ క్రికెటర్లలో తొలి ఆటగా డిగా మాత్రమే కాకుండా ప్రపంచంలో 13వ ఆటగాడిగా రికార్డు సాధి స్తాడు. అలాగే యూనిస్ 53.06 సగటుతో 9977 పరుగులు చేశాడు. ప్రస్తు తం భారత క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆడిన 200 మ్యా చ్‌ల్లో 15,921 పరుగులతో టాప్ ర్యాంకులో ఉన్నాడు.