Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

జియో ఆఫర్లపై మీ అభిప్రాయమేంటి? : ట్రాయ్

TRAIన్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఉచిత కాలింగ్, వాయిస్ డేటా ఆఫర్ల పొడిగింపుపై అభిప్రాయ మేమిటో తెలుపాలని అటార్ని జనరల్‌ను టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ కోరింది. జియో టారిఫ్ ప్లాన్ పొడిగింపు దోపిడి విధానమని ప్రత్యర్థి సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జియో అందించే టారిఫ్ ప్లాన్స్‌పై అభిప్రాయం తెలపాలని ప్రభుత్వ లీగల్ అడ్వయిజరీ అభిప్రాయాన్ని ట్రాయో కోరినట్టు తెలిసింది. హ్యాపీ న్యూయర్ ఆఫర్ కింద జియో తన పాత, కొత్త కస్టమర్లకు తాను అందిస్తున్న ఉచిత వాయిస్, డేటా ఆఫర్లను మార్చి వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్ల పొడిగింపు ఎలా నిబంధనలకు విరుద్ధం కాదో తెలుపాలంటూ జియోను ట్రాయ్ గత నెలే ఆదేశించింది. రిలయన్స్ జియో అందించిన వివరణను ట్రాయ్ ప్రస్తుతం పరిశీలిస్తుంది. కొత్త సంవత్సరం సందర్భంగా హ్యాపీ న్యూఇయర్ ఆఫర్, జియో వెల్‌కం ఆఫర్‌కు చాలా తేడా ఉందని కంపెనీ ట్రాయ్‌కు తెలిపింది. ప్రారంభ ఆఫర్ కింద రోజుకు 4జిబి ఉచిత డేటా ఇస్తే, ప్రస్తుతం 1జిబి మాత్రమే ఆఫర్ చేస్తున్నామని పేర్కొంది. ఈ విషయాలను ట్రాయ్ పరిశీలిస్తోంది.

Comments

comments