Home ఎడిటోరియల్ సోషల్ మీడియా మోజులో యువత చిత్తు

సోషల్ మీడియా మోజులో యువత చిత్తు

social-media2ఓ చిన్న రిక్వెస్టు యువత జీవితా లను చిత్తు చేస్తున్నది. పరిచయం లేనివారికి, ముక్కు, మొహం తెలియని వారికి ఫేస్‌బుక్‌లో రిక్వెస్టు పంపగానే గుడ్డిగా ‘ఓకే’ చేస్తే కొంపకొల్లేరే! ఈ మధ్య తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోనేకాక, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో కూడా ‘ఫేస్‌బుక్’ పరిచయాల వల్ల శీలం కోల్పోయినవారు, జీవితం నష్టపడినవారే కాదు, ధన, మాన, ప్రాణాలు కోల్పోయినవారు ఉన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో అబ్దుల్ మజీద్, నకిలీ ఫేస్‌బుక్ అక్కౌంట్స్ ఓపెన్ చేసి హైదరాబాద్‌లోని సంపన్న అమ్మాయిలకు ‘వల’వేసి పట్టుబడిన విషయం సంచలనం సృష్టించింది. అలాగే తూర్పుగోదావరి జిల్లా ద్వారం పూడికి చెందిన బొప్ప హరీష్ పాపాల చిట్టావిని ‘ఫేస్‌బుక్’ అంటే ‘నెట్‌జన్ల’ కు విరక్తి, భయం, ఆందోళన కల్గుతు న్నాయి. సోషల్ మీడియా కామాం ధుల పాలిట ప్లాట్‌ఫారంగా మారిందనే అభిప్రాయం కలుగుతోం ది.

రాష్ట్రాలు, దేశాలు వేరైనా ఎక్కడో ఒకచోట రోజుకోమోసం బయటపడు తోంది. రోజుకొక తరహా మోసగాళ్ళు, కేటుగాళ్ళు, ఆవారా గాళ్ళు పోలీసుల వలలో చిక్కుతున్నారు.పెళ్లికానివారికే కాదు. పెళ్ళయి పిల్లలున్న తల్లులకు కూడా కేటుగాళ్లు ‘వల’ వేస్తున్నారు. ఫేస్‌బుక్ పరిచ యం తర్వాత వేధిం పులు, చాటింగులు పెరిగిపోయి మహి ళలు నిత్యం నరకం అనుభవిస్తు న్నారు. భర్త, తల్లిదండ్రు లు, బంధు వులు, స్నేహితులకు చెబితే పరువు పోతుందేమోనని లోలోన కుమిలి పోతున్నారు.
హైదరాబాద్ ఇంటర్ నేషనల్ స్కూళ్లలో చదివే 200మంది అమ్మాయి లను ఒక వ్యక్తి పరిచయం పెంచుకుని, మోసాలు, హింసకు గురిచేసిన విష యం సంచలనం సృష్టించింది. ఫేస్ బుక్ స్నేహితుల ద్వారా నగ్న ఫోటో లు పంపమని రిక్వెస్టుపెట్టి, తెప్పించు కున్నాడనే ‘మజీద్’ పాపాల చిట్టా ఎంత పెద్దదో అట్టే తెలిసింది. ఆరు గురు అమ్మాయిల పేరుతో ‘ఫేస్‌బుక్’ అక్కౌంట్ ఓపెన్ చేసి మోసం చేసిన ‘మజీద్’ నడవడికపై పోలీసులు మరింత లోతైన ఇంటరాగేషన్ చేయాలి.

ఒకప్పుడు సెల్‌ఫోన్‌లు విద్యార్థుల కు ఉండేవి కాదు. ఇపుడు స్మార్ట్‌ఫోన్ లు వచ్చాక ఇంటర్‌నెట్ అంటూ యువత చేతికి వచ్చింది. అవసరం లేక పోయినా ప్రతి స్టూడెంట్ ‘టచ్‌స్క్రీన్’ ద్వారా, ‘వాట్సప్’ ద్వారా బూతు, అశ్లీల చిత్రాలు ‘ఫార్వార్డ్’ చేస్తూ సైబర్ నేరా లు చేస్తున్నారు. సోషల్ నెట్‌వర్కు ద్వారా విద్య, విజ్ఞానం, వినోదం, సాహిత్యం, జనరల్ నాలెడ్జి వంటి ఎన్నో లాభాలు ఉన్నప్పటికినీ అశ్లీల, శృంగార చిత్రాలు విజ్ఞతపై, బలహీనత పైచేయి సాధించి నేరాలకు పురికొల్పు తున్నది. ప్రతివ్యక్తిదగ్గర ఇప్పటికే ‘కంప్యూటర్’ ఉండకపోయినా, ‘మినీ కంప్యూటర్’ సెల్‌ఫోన్ ఉంటుంది. దీనితో యువతీ, యువకులు నైతిక విలు వలు తప్పి, సెక్స్ మాదక ద్రవ్యా లు, బ్లూఫిల్మ్‌లు వంటివానికి బాని సలు అవుతున్నారు. కాబట్టి తప్పుదారి నుంచి యువతను కాపాడటంలో తల్లిదండ్రులు ముందు జాగ్రత్తలు తీసు కోవాలి. ఏది ప్రేమో, ఏది ఆకర్షణో విద్యార్థులకు తెలియ చెప్పాలి. కేటుగాళ్ళ బారినుంచి తమ బిడ్డలను రక్షించుకోవాలి. అలాగే ప్రభుత్వం కూడా నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి.
-రావుల రాజేశం,లెక్చరర్,
జమ్మికుంట, 9848811424